అన్నానీకో దండం మహేశ్‌ను వదిలెయ్..

  • In Film
  • June 15, 2019
  • 140 Views
అన్నానీకో దండం మహేశ్‌ను వదిలెయ్..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మహర్షి చిత్రం భారీగానే వసూళ్లు సాధించినా కొన్ని ప్రాంతాల్లో పంపిణీదారులకు నష్టాలు మిగిల్చింది.వసూళ్ల విషయం పక్కనపెడితే ఈ చిత్రం సగటు ప్రేక్షకులతో పాటు మహేశ్‌ అభిమానులను సైతం ఆకట్టకులేకపోయింది.అయితే మహేశ్‌ దర్శకుడు వంశీ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా కుటుంబాలతో కలసి లండన్‌ ట్రిప్‌కు వెళ్లారు.లండన్‌లో మహేశ్‌ కుటుంబంతో కలసి తీసుకున్న స్వీయచిత్రాన్ని మహేశ్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.ఆ ట్వీట్ ని వంశీ పైడిపల్లి రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ ఫ్యాన్స్ వంశీపై సెటైర్లు వేస్తున్నారు.. ‘అన్నా నీకో దండం.. ఒక కల్ట్ సినిమా ఇస్తావనుకుంటే అదే మెసేజ్ మూవీ ఇచ్చావ్.. ఇంకో మూవీ చేయకు’ అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ‘ఇంకా మా మహేష్ ని వదలవా..?’ అంటూ మండిపడుతున్నారు.గతంలో ‘దూకుడు’ సినిమా హిట్ అయిందని శ్రీనువైట్లకి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న మహేష్ మరోసారి వంశీతో సినిమా తీసి ఇలాంటి అనుభవమే పొందుతాడేమోనని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మహేష్ బాబు ఇలా ఫోటోలు షేర్ చేయడం మానేసి.. తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి!

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos