జాతీయస్థాయిలో హాట్‌ టాపిక్‌గా యశ్‌ పుట్టినరోజు వేడుకలు..

  • In Film
  • January 8, 2020
  • 133 Views
జాతీయస్థాయిలో హాట్‌ టాపిక్‌గా యశ్‌ పుట్టినరోజు వేడుకలు..

ఏ ముహూర్తానో కేజీఎఫ్‌ చాప్టర్‌ చిత్రం మొదలుపెట్టారో కానీ కేజీఎఫ్‌ చిత్రం సాధించిన విజయంతో కన్నడ స్టార్‌ హీరో యశ్‌ ఒక్కసారిగా జాతీయస్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు.కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 ఇచ్చిన విజయంతో దర్శకనిర్మాతలు చాప్టర్‌ 2 ను మరింత భారీస్థాయిలో తెరకెక్కిస్తుండగా కన్నడతో పాటు ఇతర భాషల అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.కేజీఎఫ్‌ చిత్రంతో యశ్‌కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు.ఈ నేపథ్యంలో యశ్‌ పుట్టినరోజు సందర్భంగా బెంగళూరు నగరంలో అభిమానులు యశ్‌ పుట్టినరోజు వేడుకలు భారీస్థాయిలో నిర్వహించారు.ఒకటి కాదు రెండు కాదు 5వేల కేజీల భారీ కేకు కత్తరించి యశ్‌ పుట్టినరోజు వేడుకలు జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos