మాజీ ఎమ్మెల్యే వెంకట రెడ్డి హఠాన్మరణం

హొసూరు : స్థానిక మాజీ ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది టి. వెంకట రెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. హొసూరు సమీపంలోని బలగేరి గ్రామంలో పుట్టిన వెంకట రెడ్డి రెండు సార్లు హొసూరు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. సీనియర్ న్యాయవాదిగా కూడా ఆయన సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో హొసూరు ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన వెంకట రెడ్డి  హఠాన్మరణం పట్ల పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హొసూరు మాజీ ఎమ్మెల్యేలు కేఏ. మనోహరన్, గోపీనాథ్, మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే  సత్య, తళి ఎమ్మెల్యే వై. ప్రకాష్, తళి మాజీ ఎమ్మెల్యే టి.  రామచంద్రన్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెంకట రెడ్డికి నివాళులర్పించారు. ఆయన దహన సంస్కారాలను బలగేరి గ్రామంలో బంధువులు నిర్వహించారు. వెంకట రెడ్డి మరణం కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా హొసూరు ప్రజలకు సైతం తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos