కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కూతురికి గాయాలు..

కారు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కూతురికి గాయాలు..

అలంపూర్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఘటనలో స్వల్పగాయాలతో బయటపడ్డారు.మణికొండలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సంపత్‌కుమార్‌ కుమార్తె దీపికా శుక్రవారం ఉదయం కారులో కాలేజీకి బయలుదేరారు.ఈ క్రమంలో మొయినాబాద్‌ హజీజ్ పూర్ గ్రామానికి చేరుకోగానే అదే  సమయంలో అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి నియంత్రణ తప్పి కుడివైపు డివైడర్ దాటి రోడ్డు అవతలవైపున్న చెట్టును కారు బలంగా ఢీ కొట్టింది. గమనించిన గ్రామస్థులు వెంటనే దీపికా నుంచి కారు నుంచి రక్షించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా దీపికాకు స్వల్పగాయాలయ్యాయి.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos