కుప్ప కూలిన విపణి

కుప్ప కూలిన విపణి

ముంబై: దేశీయ మార్కెట్లు భారీగా నష్ట పోతున్నాయి. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, శ్లాబులను సవరించినా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడమే మార్గమని అందరూ భావించారు. ఈ దిశగా బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేకపోవడంతో సూచీలు ఒక్కసారిగా దిగజారాయి. పన్ను చెల్లింపుపై పరోక్ష ఆంక్షలు విధించటం, ఇంకా పన్ను చెల్లింపును ఐచ్చికం చేయటం,పాత పన్ను విధానాన్ని కూడా కొనసాగించటం మదుపర్లను అయోమయానికి గురి చేసింది.మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 40,135 వద్ద, నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 11,792 వద్ద ఉన్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లు కుదేలైంది. మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
ఆదాయపు పన్ను కొత్త నియమాలు
*రూ.5 -రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం
* రూ.7.5-రూ.10లక్షల వరకు 15శాతం.
*రూ.10- రూ.12.5లక్షల వరకు 20శాతం.
*రూ.12.5–రూ.15లక్షల వరకు 25 శాతం.
*రూ.15లక్షలకు పైగా 30 శాతం పన్ను.
మినహాయింపులు పొందాలా?వద్దా? అన్నది పన్ను చెల్లింపుదార్లు నిర్ణయించుకోవాలి. పాత విధానంతో పాటు కొత్త విధానం కూడా అమల్లో ఉండనుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే 80(సి) మినహాయింపులు రావు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos