40 అంతస్తుల భవనాలు రెండింటినీ కూల్చేయండి

40 అంతస్తుల భవనాలు రెండింటినీ కూల్చేయండి

న్యూ ఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నొయిడాలో నిర్మించిన రెండు 40 అంతస్తుల భవనాల్ని కూల్చేయాలని సుప్రీంకోర్టు మంగళ వారం ఆదేశించింది. సూపర్టెక్ ఎమరాల్డ్ సంస్థ వీటిని కట్టింది. నొయిడా అధికార యంత్రాంగం పర్యవేక్షణలో 3 నెలల్లోగా ఈ పని పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థ అయిన సూపర్టెక్ నుంచే వసూలు చేయాలని నిర్దేశించింది. ఆ రెండు భవనాల్లో కలిపి దాదాపు 1000 ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం.అక్కడ ఫ్లాట్లు కొన్నవారందరికీ పూర్తి సొమ్మును 12 శాతం వడ్డీతో సూపర్టెక్ సంస్థ తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇంకా అ కట్టడం వల్ల వేదనకు గురైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కూ రూ. 2 కోట్లు కట్టాలని తీర్పు చెప్పింది. 2014 ఏప్రిల్ 11న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం అవసరంలేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎంఆర్. షా సభ్యులుగా గల సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. నోయిడా అధికారులతో కుమ్మక్కై నిర్మాణం చేపట్టినట్లు హైకోర్టు సరిగానే గుర్తించిందని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos