ఏనుగుకు అనారోగ్యం

ఏనుగుకు అనారోగ్యం

హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట అటవీ ప్రాంతంలో 18 ఏళ్ళ వయసు గల ఏనుగు అనారోగ్యంతో బాధపడుతుండగా స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నోగనూరు అటవీ ప్రాంతంలో  అనారోగ్యంతో ఓ  ఏనుగు కొట్టుమిట్టాడుతోంది. స్థానికుల సమాచారం మేరకు దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకున్న అధికారులు దానిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. వైద్య బృందం ఏనుగుకు చికిత్సలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దాని ఆరోగ్యం కుదటపడకపోగా మరింత క్షీణించింది. అయినా దాని ప్రాణాలను నిలబెట్టడానికి వైద్య సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos