దిష్టిబొమ్మ దహనంలో ముగ్గురికి గాయాలు

దిష్టిబొమ్మ దహనంలో ముగ్గురికి గాయాలు

హనుమ కొండ : భాజపా కార్యకర్తలు సోమవారం ఇక్కడ దిష్టి బొమ్మను దహనం చేస్తునపుడు ప్రమాద వశాత్తు ముగ్గురు కార్యకర్తలకు నిప్పంటుకుంది. వారిని వెంటనే ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నేరగాడిని కఠినంగా శిక్షించాలని భాజపా అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో ఉదయం 11 గంటలకుధర్ణా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బొమ్మపై కిరోసిన్ పోస్తున్నప్పుడు శ్రీనివాస్ అనే కార్యకర్తపై కిరోసిన్ పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు అప్పుడే పోలీసులు రావడంతో తోపులాట జరగింది. ఈ సమ యంలోనే బొమ్మకు నిప్పంటించారు. కిరోసిన్ పడిన శ్రీనివాస్కూ మంటలు అంటుకున్నారు. సమీపంలో ఉన్న పద్మారెడ్డికి అవి వ్యాపించాయి. మరో మహిళా కార్యకర్త చీరకూ నిప్పంటుకుని గాయపడింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos