కేసీఆర్‌కు ఎన్నికల సంఘం హెచ్చిరిక..

కేసీఆర్‌కు ఎన్నికల సంఘం హెచ్చిరిక..

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కమిషన్‌ నోటీసు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారాల్లో
భాగంగా మార్చి 17వ తేదీన కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో బీజేపీని
ఉద్దేశించి హిందూగాళ్లు బొందగాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈసీ కేసీఆర్‌కు నోటీసు జారీ చేసింది.బిజెపిని ఉద్దేశించి కేసిఆర్
కరీంనగర్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్
వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్ర శాఖ అద్యక్షుడు ఎం.
రామరాజు ఈసీకి ఏప్రిల్ 9వ తేదీన ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా, పార్టీ
అధ్యక్షుడిగా కేసీఆర్ కొన్ని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి
ఉండాలని ఈసీ అభిప్రాయపడింది.విభిన్న
కులాలు, సమూహాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా
లేదా విద్వేషాలు సృష్టించే
విధంగా మతపరమైన లేదా భాషాపరమైన రాజకీయ
పార్టీ గానీ అభ్యర్థులు గానీ
వ్యాఖ్యలు చేయడం నిబంధనలకు విరుద్ధమని
ఈసీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను కేసీఆర్ ఉల్లంఘించారని స్పష్టం
చేసింది.భవిష్యత్తులో జాగ్రత్తగా
ఉండాలని, బహిరంగ ప్రకటనలు చేసే విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి
లోబడి వ్యవహరించాలని ఈసీ
కేసీఆర్ ను హెచ్చరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos