మందుబాబుల స్మార్ట్ తెలివి..

మందుబాబుల స్మార్ట్ తెలివి..

సంతోషంతోనో,బాధతోనో స్నేహితులు,బంధువులతో పీకలదాక మందేసి వాహనాలపై ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు నిర్వహించే డ్రంక్‌ డ్రైవ్‌లో దొరికి వేలకు వేలు జరిమానాలు కట్టడం మందుబాబులకు తరచూ ఎదరుయ్యే పరిణామమే.దీంతో పార్టీలకు వెళ్లాలని ఉన్నా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లకు భయపడి కొంత మంది బార్ల వైపు వెళ్లడం మానేశారు.అయితే చాలా మంది మందుబాబులు మాత్రం పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి తప్పించుకోవడానికి ఏదోఒక ఎత్తుగడతో పోలీసులను బోల్తా కొట్టిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం నిమ్మకాయ రసం,పుదీనా రసం తాగుతూ అప్పుడప్పుడూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి తప్పించుకునేవారు.అయితే అది అంతగా ఫలితాలు ఇవ్వకపోడంతో తాగాక పోలీసులకు దొరక్కుండా ఉండడానికి ఏం చేయాలో బాగా ఆలోచించిన మందుబాబులు ఏకంగా ఒక వాట్సాప్‌ గ్రూపునే ఏర్పాటు చేసుకోవడం విస్మయపరస్తోంది.తాము వెళ్లే రూట్లలో ఎవరికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కనపడితే చాలు.. సదరు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. ఫలానా రూట్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారని మిగతా గ్రూప్ సభ్యులను అలర్ట్ చేస్తున్నారు. దాంతో సదరు మేసేజ్ చూసినోళ్లు రూట్లలో వెళ్లకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకుంటున్నారు. ఇతర మార్గాల్లో పయనిస్తూ పోలీసుల కళ్లుగప్పుతున్నారు.ఇక కరీంనగర్ జిల్లాలో మందుబాబులు మరింత అడ్వాన్స్గా ఉన్నారు. పోయిన సంవత్సరమే అక్కడ వాట్సాప్ గ్రూపుల లీలలు బయటపడ్డాయి. మందుబాబులు కలిసి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూపుల తాలూకు బండారం గుట్టురట్టు చేశారు పోలీసులు. మందుబాబుల న్యూసెన్స్ పెరిగిందనే క్రమంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల సాయంతో మందుబాబుల ఆట కట్టించారు. అయితే మందుబాబులు రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పోలీసులు కూడా ధృవీకరించిన సందర్భాలున్నాయి. వాట్సాప్ గ్రూపులో చేరాలంటే ఒక్కో సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారట అడ్మిన్లు. అంతేకాదు కొన్ని నిబంధనలు కూడా విధించారు. గ్రూపుల్లో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్టులు పెట్టాలి. గుడ్ మార్నింగులు, తొక్క తోలు అంటూ గ్రూప్ పేరుకు తగ్గట్లుగా లేని అనవసర పోస్టులు పెడితే రెండు వందల రూపాయల ఫైన్ కూడా విధిస్తారట. ఒకవేళ ఆ జరిమానా చెల్లించని పక్షంలో సదరు గ్రూప్ సభ్యులను ఎలిమినేట్ చేస్తారట.అప్పట్లో కరీంనగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి పోలీసులు ఖుషీగా ఫీలయ్యారు. తమ చర్యల వల్లనే కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించారు. అయితే అసలు విషయం అర్థం కాక కేసులు ఇంతలా తగ్గిపోవడానికి కారణమేంటని విశ్లేషించే పనిలో పడ్డారు. క్రమంలో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. అప్పుడు గానీ పోలీసుల అనుమానం నిజం కాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లు అర్ధరాత్రి వరకు నిర్వహించినా.. మందుబాబులు దొరక్కపోవడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను రంగంలోకి దించారు. దాంతో అసలు విషయం వెలుగుచూసింది. మందుబాబులు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారనే నిజం బయటపడింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos