తాగిన మైకంలో ప్రాణం మీదకు తెచ్చుకుంది..

తాగిన మైకంలో ప్రాణం మీదకు తెచ్చుకుంది..

ఒక్కసారి మద్యం లోపలి వెళితే స్వాతి ముత్యంలో కమల్ లా ఉండే వాళ్ళు కూడా అపరిచితుడులో విక్రమ్ లా మారిపోతారు.విపరీతమైన చర్యలు,అదుపు లేని మాటలతో రెచ్చిపోతారు.ఈస్ట్ యార్క్ షైర్ లో ఓ యువతీ మద్యం మత్తులో ప్రాణం మీదకు తెచ్చుకుంది.ఈస్ట్ యార్క్‌షైర్‌లోని హల్‌కు చెందిన రోసీ కోల్ (21) తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.అప్పటి వరకు స్నేహితులంతా కబుర్లతో కాలక్షేపం చేసారు. పీకల దాకా మద్యం సేవించి ఓ ఛాలెంజ్ స్వీకరించారు.సరదాగా ఆడిన ఆట ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.రోల్ వంతు వచ్చేసరికి ఆమె అందులో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక చాలా ఇబ్బంది పడింది. ఎంత ప్రయత్నించినా రాలేకపోతోంది. ఒకానొక దశలో నడుము క్రింది భాగం మరింత పట్టుకున్నట్లు అనిపించింది. దాంతో రోసీ ఆందోళన చెందింది. వెంటనే స్నేహితులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వచ్చి ఆమెను పట్టుకుని నిదానంగా ముందుకు లాగారు. దీంతో ఆమె వాషింగ్ మెషీన్ నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos