భారత వ్యాపారులను రానివ్వని డ్రాగన్​ దేశం

భారత వ్యాపారులను రానివ్వని డ్రాగన్​ దేశం

న్యూ ఢిల్లీ : భారతీయ వ్యాపారులకు చైనా ప్రవేశాన్ని నిరాకరించింది. తమ టీకాలు వేసుకున్న వారినే రానిస్తామంటూ మార్చి 15న చైనా ఆంక్షల్ని విధించింది. చాలా మంది ఆ టీకాలు వేసుకున్నా చైనా వారికి వీసాలివ్వట్లేదు. ‘మీ టీకాలే తీసుకున్నాం.. మమ్నల్ని రానివ్వండి’అని 300 మందికి పైగా భారతీయులు చైనాకు విజ్ఞప్తి చేసాయి. మన దేశంలో చైనా తయారు చేసిన కరోనా టీకాలు లేవు. దీంతో వ్యాపారులు దుబాయ్, నేపాల్, మాల్దీవ్స్ వంటి దేశాలకు వెళ్లి చైనా టీకాలు వేసుకున్నారు. భారత్ లోని చైనా రాయబారి సన్ వీడాంగ్, చైనా రాజధాని బీజింగ్ లోని భారత ఎంబసీకీ చైనా ప్రవేశానికి విన్నవించారు. కరోనా పరీక్షలతో పాటు కఠినమైన క్వారంటైన్ కూ సిద్ధంగానే ఉన్నామని పేర్కొన్నారు. భారత్ లోని రాయబార కార్యాలయంలో సంప్రదించాలని చైనా విదేశాంగ ప్రతినిధి సూచించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos