డాలర్ శేషాద్రి సేఫ్!

డాలర్ శేషాద్రి సేఫ్!

తనపై తొలగింపు వేటు పడనివ్వకుండా డాలర్ శేషాద్రి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న దాదాపు వందమంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందిపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శ్రీవారి ఆలయ ఓఎస్డీగా ఉన్న డాలర్ శేషాద్రిపైనా వేటు తప్పదని భావించారు.సిబ్బంది తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన టీటీడీ నిన్న వందమందికి ఉద్వాసన చెప్పింది. తొలగింపునకు గురైన వారిలో డాలర్ శేషాద్రి పేరు లేకపోవడంతో తొలగింపు వేటు నుంచి తప్పించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలు నేడు వెల్లడికానున్నాయి. నిజానికి డాలర్ శేషాద్రి తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు శేషాద్రికి వర్తించే అవకాశం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో వాటిని పక్కన పెట్టేశారు.ఈ నేపథ్యంలో డాలర్ శేషాద్రి కొనసాగింపు తథ్యమని తెలుస్తోంది.సుదీర్ఘ కాలంగా స్వామివారి సేవలో ఉన్న శేషాద్రిపై అనేక విమర్శలు ఉన్న విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos