అంతం చేస్తానన్న ఎమ్మెల్యే

అంతం చేస్తానన్న ఎమ్మెల్యే

నెల్లూరు : గ్రామీణ శాసనసభ్యుడు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి తనను హతం చేస్తామని బెదిరించినట్లు జమీన్ రైతు వార పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఉన్న మా ఇంటికి ఎమ్మెల్యే మద్యం సేవించి వచ్చారు. ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో. ఎమ్మెల్యే ఆమె చేయి పట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారు. వస్తూనే.. ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో.. అంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎవరితో చెప్పుకుంటావ్ ఎస్పీతోనా, మంత్రితోనా, సీఎం జగన్ తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. అని బెదిరించారు. ఇంటి వద్దకు వచ్చి ఇలా రచ్చ చేయడం ఏమిటని నేను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరి కొందరు కూడా తనపై దాడి చేశార’ని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos