హోసూరులో ‘అందరూ మనతో’ ప్రారంభం

హోసూరులో ‘అందరూ మనతో’ ప్రారంభం

హోసూరు : డిఎంకె పార్టీ కొత్తగా ‘అందరూ మనతో’ పేరిట ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు  కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2021లో తమిళనాడు రాష్ట్రంలో జరుగనున్న శాసన సభ  ఎన్నికలపై ప్రధాన పార్టీలైన ఎడిఎంకె, డిఎంకె పార్టీలు దృష్టి సారించాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించాయి. ఒక పక్క ఎడిఎంకె పార్టీలో కొత్తగా సభ్యులను చేర్పించడానికి ఆ పార్టీకి చెందిన నాయకులు కృషి చేస్తుండగా, వారికి ధీటుగా డిఎంకె పార్టీ నాయకులు కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 15వ తేదీ డిఎంకె పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ అందరూ మనతో (ఎల్లోరు నమ్ముడన్)పేరిట ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టాలిన్ పిలుపు మేరకు అయిదు రోజుల్లో స్వచ్ఛందంగా 1.5 లక్షల మంది ఆన్‌లైన్‌లో డిఎంకె సభ్యత్వాన్ని స్వీకరించినట్లు పార్టీ ప్రకటించింది. హోసూరు దక్షిణ విభాగపు పార్టీ కార్యదర్శి, తళి ఎమ్మెల్యే వై.ప్రకాష్ అధ్యక్షతన హోసూరు సమీపంలోని పెద్ద బేలగొండపల్లి గ్రామంలో ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. హోసూరు ఎమ్మెల్యే సత్య, వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్, ఆపార్టీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా ఆన్‌లైన్‌లో డిఎంకె సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఎంకె పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos