నిందితులకు తొలి రోజే మటన్‌ భోజనం.

నిందితులకు తొలి రోజే మటన్‌ భోజనం.

దిశా హత్యాచారం కేసులో నిందితులకు చర్లపల్లి జైల్లో జైలు సిబ్బంది మెుదటి రోజే మటన్ కర్రీతో భోజనం పెట్టారు. దిశ హత్యకేసులో శనివారం షాద్ నగర్ మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.ఆదివారం జైలు నిబంధనల ప్రకారం ఖైదీలకు మాంసాహారాన్ని అందించాల్సి ఉంటుందని అందులో భాగంగా నలుగురు నిందితులు ఆదివారం రాత్రి మటన్ తో భోజనం చేసినట్లు జైలు సిబ్బంది తెలిపారు.కాగా నిందితులు నలుగురు పోకిరీలని ఎప్పుడూ తాగుతూ జులాయిగా తిరుగుతుండేవారని గుడిగండ్ల గ్రామస్థులు చెబుతున్నారు.గుడి గండ్లకు చెందిన నవీన్, శివ, చెన్నకేశవులు, జక్లేర్ కు చెందిన ఆరిఫ్లు ఒకే లారీపై డ్రైవర్, క్లీనర్గా పనిచేస్తున్నారు. నవీన్, చెన్నకేశవులు,శివలు గ్రామంలో జులాయిగా తిరిగేవారు.ఇటీవలనే వారంతా లారీపై పనికి కుదిరారని తమ జల్సాల కోసం లారీపై పనికి వెళ్లేవారు. పని నుండి వచ్చిన తర్వాత జల్సాలు చేసుకొంటూ ఉండేవారని స్థానికులు చెప్పారు.గుడిగండ్లలో నవీన్ పేరు చెబితేనే స్థానికులు భయానికి గురౌతున్నారు. నవీన్ తన బైక్పై హెడ్లైట్ తీసేసి చిన్న లైట్లు పెట్టాడు. హెడ్ లైట్ స్థానంలో డేంజర్ అంటూ రాసి ఉన్న సింబల్ ను పెట్టుకొన్నాడు. బైక్ వెనుకన పులి గుర్తును పెట్టాడు. పులి గుర్తు కింద ఎన్ అనే అక్షరం స్టిక్కర్ వేసుకొన్నాడు.

నిందితుడు నవీన్‌ బైకు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos