పవన్‌కళ్యాణ్‌ను అలా చూడాలనుంది..

పవన్‌కళ్యాణ్‌ను అలా చూడాలనుంది..

మాటల తూటాలు పేల్చడంలో,సినిమాలతో వివాదాలు సృష్టించడంలో,ఎవరికీ అర్థం కానీ రీతిలో ట్వీట్లు చేయడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మను మించినోళ్లు లేరనే చెప్పాలి.అదే సమయంలో తాను ఎద్దేవా చేసిన వ్యక్తులను ఆకాశానికి ఎత్తేయడంలో కూడా ఆర్జీవీ దిట్టే.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఓ ఇంటర్‌వ్యూలో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తాను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.పవన్ కళ్యాణ్ ను ఎప్పటికైనా సీఎంగా చూడాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని వర్మ స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను గతంలో తాను ఎన్నోసార్లు కలిశానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున చాలా బాగా కష్టపడుతున్నారని అయితే ఆయన చుట్టూ ఉన్న టీంపై వర్మ సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లు అంత ఉద్దండులు కాదని అభిప్రాయపడ్డారు.ఇకపోతే వేదికలపై పవన్ కళ్యాణ్ స్పీచ్ తనకు ఎంతో నచ్చుతుందన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని పార్టీలో నేతలు స్ట్రాంగ్ గా లేరని విమర్శించారు.పార్టీ పటిష్టంగా లేదని తన అభిప్రాయమని అభిప్రాయపడ్డారు. మెగా ఫ్యామిలీకి, తనకు మధ్య ఏవో బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos