దౌత్య వ్యవస్థను కొనసాగించాలి

దౌత్య వ్యవస్థను కొనసాగించాలి

న్యూ ఢిల్లీ: భారత్తో దౌత్య, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి తగ్గించే నిర్ణయాలపై ఒక సారి సమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గురువారం పాకిస్థాన్ను కోరింది. జమ్ము-కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడం అంతర్గత వ్యవహారమని పేర్కొంది.‘ రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతను ప్రపంచానికి చూపే ఉద్దేశమే పాకిస్థాన్ చర్యల ఆశయంగా కనిపిస్తోది. ఆ దేశం చూపిన కారణాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయ’ని ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఇస్లామాబాద్లోని భారత రాయబారిని బహిష్కరించడంతో పాటు, దిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్ ఉల్ హక్ను అక్కడికి పంపరాదని పాక్ నిర్ణయించింది. ‘జమ్ము-కశ్మీర్ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసాం.ఆ రాష్ట్రంలో లింగ, సామాజిక, ఆర్థిక వివక్షను రూపు మాపడానికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించడంతో పాటు, జమ్ము కశ్మీర్లోని ప్రజల జీవితాలు మెరుగవుతాయ’నీ పేర్కొంది. ‘సరిహద్దు ఉగ్రవాదాన్ని సమర్థించు కోడానికి ఈ సంవేదనను ఉపయోగించు కుంటుంద’ని ఆరోపిం చింది. దౌత్య సమాచార మార్పిడి కోసం ప్రస్తుతమున్న మార్గా లను అలాగే కొనసాగించాలని కోరింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos