వాహనదారులు బెంబేలు

వాహనదారులు బెంబేలు

ముంబై : దేశీయంగా ఇంధన ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు – గురువారం పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోల్ ధరను 25 పైసలు, డీజిల్పై 30 పైసలు చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఈ తాజాపెంపుతో దేశవ్యాప్తంగా మెట్రోలలో ధరలు కొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. దీంతో వాహనా దారుల్లో అలజడి మొదలైంది. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్ , డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 87.85, రూ. 78.03,ముంబైలో రూ. 94.36 రూ. 84.94, కోల్కతాలో రూ .89.16,రూ .81.61, చెన్నైలో రూ .90.18 , రూ . 83.18 బెంగళూరులో రూ.90.78, రూ.82.72, హైదరాబాదులో రూ. 91.35, ధర రూ. 85.11, అమరా వతిలో రూ.93.99, రూ. 87.25 కి చేరాయి. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos