ఐదు టన్నుల బాంబు పేలితే ఎలా ఉంటుందో తెలుసా ?

ఐదు టన్నుల బాంబు పేలితే ఎలా ఉంటుందో తెలుసా ?

ప్రపంచం మరువలేని యుద్దాల్లో రెండో ప్రపంచ యుద్దం ఒకటి. ఈ యుద్దంలో ప్రాణ నష్టం మాత్రమే కాదు.. ఆస్తి నష్టం కూడా భారీగా మిగిలింది అంటారు. రెండో ప్రపంచ యుద్దంలో బాంబుల మోత మోగింది.. ఎన్నో బాంబులు ఇక్కడ పేలాయి. అయితే రెండవ ప్రపంచం నాటి బాంబులు కొన్ని ఇప్పటికీ భూమిలో ఉండిపోయాయి. అప్పుడప్పుడు తవ్వకాల్లో అవి బయట పడుతుంటాయి. తాజాగా రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్ నదీలో బయట పడింది.టాల్ బాయ్ గా పిలిచే ఈ బాంబు దాదాపు 5400 కిలోలు ఉంటుందని అక్కడి నౌకాదళ అధికారులు తెలిపారు. ఈ బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తీ నష్టాలు జరగలేదని తెలిపారు. 1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ యుద్ధ నవక లుట్జోపై బ్రిటన్ రాయల్ వాయుసేన ఈ బాంబును వదిలింది.అప్పటినుంచి ఈ బాంబ్ పోలాండ్ లో ఉండి పోయింది. అయితే దీని వల్ల ఎప్పటికైనా దీని వల్ల ప్రమాదం ఉందని భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్వీనోజ్సై ప్రాంతంలోని పియూస్ట్ కాలువలో నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది దానిని నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos