అయోధ్య కేసు న్యాయవాదికి బెదిరింపులు

అయోధ్య కేసు న్యాయవాదికి బెదిరింపులు

న్యూఢిల్లీ : అయోధ్య భూవివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదించొద్దని చెన్నైకి చెందిన మాజీ ప్రొఫెసర్ ఎన్.షణ్ముగం తనను బెదిరి స్తున్నా డని న్యాయవాది రాజీవ్ ధావన్ మంగళ వారం అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. దీనికి సంజాయిషీ ఇవ్వాలని అత్యున్నత న్యాయ స్థాన రాజ్యాంగ ధర్మాసనం షణ్ముగానికి తాఖీదుల్ని జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రామ జన్మ భూ మి – బాబ్రీ మసీదు స్థల వివాదంపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూష ణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం భూ వివాదం గురించి ఆగస్టు ఆరు నుంచి రోజువారీ విచారణ చేపట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos