కరోనా కట్టడికి ధారావి ఆదర్శం

కరోనా కట్టడికి ధారావి ఆదర్శం

ముంబై: ఇక్కడి మురికి వాడ ధారావిలో కరోనా కట్టడికి ప్రభుత్వం కోసం తీసుకున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసిచింది. దేశవ్యాప్త ఐక్యత, అంతర్జాతీయ సోదరభావంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు.‘వైరస్ విజృంభణ తీవ్రంగా ఉన్నప్పటికీ నియంత్రణ సాధ్యమే అనడానికి ప్రపంచ వ్యాప్తంగా మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా, ముంబయిలోని ధారావి మురికివాడల కథలే నిదర్శనం. వైరస్ వ్యాప్తిని అడ్డుకు నేందుకు బాధితుల గుర్తింపు, పరీక్షలు, ఐసోలేషన్ అనేవి చాలా కీలకం’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచాలకుడు టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. సమష్టి కార్యా చరణ, ప్రజా భాగస్వామ్యం, సరైన దిశగా నడిపించే నాయకత్వమే ప్రస్తుత తరుణంలో మనకు అవసరమన్నారు.. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సహా అనేక దేశాల్లో ఆంక్షలను సడలించడం వల్ల వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos