ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం

ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం

అమరావతి : రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇక్కడ జరిగిన పోలీసు ఉన్నతాధికార్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల సమస్య తీవ్రంగా ఉందని హెచ్చరించార. రక్షణ విషయంలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుల, మతాల మధ్య గొడవలు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆక్రోశించారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల తర్వాత రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.‘రహదారి ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య నిరుడు గణనీయంగా తగ్గింది. ఈ వంచన నేరాల సంఖ్య బాగా పెరిగింది. 2018లో రాష్ట్రంలో మొత్తం 1,22,268 కేసులు నమోదయ్యాయి. ఆస్తుల కేసుల్లో విజయవాడ, తూర్పుగోదావరి అగ్ర స్థానంలో ఉంది. గుంటూరు రూరల్ ప్రాంతాల్లో దాడులు కేసులు ఎక్కువ. 880 హత్య కేసులు నిరుడు నమోదయ్యాయి. ఆర్ధిక నేరాల్లో పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయవాడ అగ్రస్థానంలో ఉన్నాయి. మహిళలపై నేరాల్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి.ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో గుంటూరు జిల్లా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మొదటి ముడుస్థానాల్లో ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరులో ఎక్కువగా మృతి చెందుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు 1556 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో విశాఖ అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ కేసులు కూడా విశాఖలోనే ఎక్కువ” అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos