దేవినేని ఉమకు సీఐడీ తాఖీదు

దేవినేని ఉమకు సీఐడీ తాఖీదు

అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. గురువారం కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది. సీఎం జగన్ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు గురువారం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు గొల్లపూడిలోని ఉమ నివాసంలో ఆయనకు నోటీసులు అందజేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రెస్ మీట్లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడి యోలు ప్రదర్శించారని అభియోగం. ప్రెస్మీట్లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని కోరారు. ఐపీసీ 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కిం ద కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos