ఇంట గెలిస్తేనే…

ఇంట గెలిస్తేనే…

ముంబయి: మరో కొన్ని నెలల్లో ప్రపంచ కప్‌ సమరం ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం అందరి కళ్లూ జట్టు కూర్పుమీదే ఉన్నాయి. ప్రపంచ కప్‌కు ఎవరెవరు ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీమిండియా ఆటగాళ్ల పరంగా చూసుకుంటే ఇప్పుడు జట్టు పరిస్థితి బాగానే ఉంది. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ తిప్పేసే ఆటగాళ్లున్నారు. అయితే గత కొన్నాళ్లుగా భారత జట్టు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మాత్రం సారథి విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి అంటున్నారు ఛీప్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశవాళీ మ్యాచ్‌లను చూటానికి ఎంతో బాగుంటాయి. ఎందుకంటే విదేశీ గడ్డపై ఆడాలంటే ముందు స్వదేశంలో బాగా రాణించాలి. మన దేశవాళీ క్రికెట్‌ ఎంతో బాగుంది. ప్రతి ఏడాదీ జట్టులోకి వచ్చే కొత్త ఆటగాళ్లలో ఎంతో ప్రతిభ ఉంది. అందుకే నాతో పాటు నా సహోద్యోగులు సైతం వారి మ్యాచ్‌లను క్రమం తప్పకుండా చూస్తుంటాం.ఇప్పుడు టీమిండియాలో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం టీమిండియాలో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. నేను, నా సహోద్యోగులు ఇక్కడి నుంచి వదిలి వెళ్లేటప్పుడు టీమిండియాను ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్నాం. వచ్చే దశాబ్ద కాలం వరకు నాణ్యమైన ఆటగాళ్లకు కొరత లేకుండా టీమిండియాను చూడాలనుకుంటున్నాం. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా మరింత పటిష్ఠంగా తయారవాలి. అన్ని ఫార్మాట్లలో భారత జట్టు రాణిస్తూ ఉంటే చూసి ఆనంద పడతాం’ అని చెప్పుకొచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos