బాబు నివాసమూ కూల్చి వేతకు సన్నాహాలు

బాబు నివాసమూ కూల్చి వేతకు సన్నాహాలు

అమరావతి: రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు బుధవారం ప్రభుత్వం భవనం ప్రజా వేదికను నేలమట్టం చేయటంతో అధికార్లు శ్రీకారం చుట్టను న్నారు. దీని తర్వాతి లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస చేసిన కట్టడమని అధికార్లు చెప్పారు. ప్రజా వేదిక కూల్చివేత చర్యల్ని చేపట్టినట్లు రెవిన్యూ శాఖ మంగళవారం సీఆర్డీఏకు తెలిపింది. ప్రజా వేదిక భవనాన్ని కూల్చి వేయాలని సోమ వారం ముఖ్యమంత్రి జగన్ అధికా రుల్ని ఆదేశించారు. మంగళ వారం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.ప్రజా వేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం గురించి కూడ వ్యాఖ్యానిం చారు. అక్రమంగా నిర్మించిన భవనంలో నివసిస్తున్న చంద్రబాబు పక్కనే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజా వేదికనూ నిర్మించారని మండి పడ్డారు.గత ప్రభుత్వ హాయంలో నిబంధనలకు విరుద్దంగా అనేక నిర్మాణాలు చోటు చేసుకొన్నాయని ఆరోపించారు. తనతో సహా ఎవరూ అలాంటి నిర్మాణాల్ని చేసినా ఉపేక్షించ వద్దని సూచించారు. జగన్ ఆదేశానుసారం రెవిన్యూ యంత్రాంగం అక్రమ కట్టడాల కూల్చివేతకు ఏర్పాట్లు ప్రారంభిం చింది. ఈ నెల 19న ఐరోపా పర్యటనకు వెళ్లిన చంద్ర బాబు నాయుడు మంగళవారం హైద్రాబాద్కు తిరిగి వచ్చారు. బుధవారం అమరావతికి రానున్నారు. లింగమ నేని అతిథి గృహాన్ని ఖాళీ చేయాలని చంద్రబాబును వైకాపా నేతలు కోరారు. సానుకూలంగా స్పందించక పోతే దాన్ని కూల్చివేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదివరకే హెచ్చరించారు. చంద్రబాబుకు రెవిన్యూ, సీఆర్డీఏ అధికారులు బుధవారం నివాస ఖాళీ తాఖీదుల్ని ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసంతో పాటు పలు ఆశ్రమాలు, రాజకీయ ప్రముఖుల అతిథి గృహాలు ఈ ప్రాంతంలో నిర్మించారు. అన్ని రకాల నిబం ధ నలను ఉల్లంఘించి రాష్ట్రంలో కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని జగన్ ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos