పంచాయతీరాజ్ చట్టం తెలుగు ప్రతులను ఇవ్వాలి

హొసూరు :  క్రిష్ణగిరి జిల్లాలోని ఐదు యూనియన్లలో గెలుపొందిన కౌన్సిలర్లకు, జిల్లా కౌన్సిలర్లకు, పంచాయతీ అధ్యక్షులకు పంచాయతీరాజ్ చట్టాన్ని తెలుగులో ముద్రించి ప్రతులను అందజేయాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్న గుట్టప్ప డిమాండ్ చేశారు.  క్రిష్ణగిరి జిల్లాలోని హొసూరు, శూలగిరి, కెలమంగలం, తళి, వేపనపల్లి యూనియన్లలో పూర్తిగా తెలుగు వారు నివసిస్తున్నారని తెలిపారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన వారిలో కూడా 75 శాతం మంది తెలుగు వారేనని గుర్తు చేశారు. కనుక వారందరికీ 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని తెలుగులో ముద్రించి ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. పంచాయతీరాజ్ చట్టాన్ని తెలుగులో ముద్రించి ఇస్తే, వారికి అవగాహన కలుగుతుందని అన్నారు. అదేవిధంగా సమావేశాలలో, గ్రామ సభలలో అజెండాలు, తీర్మానాలు తెలుగులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హొసూరు ప్రాంతంలో తెలుగు, కన్నడ చదువుకున్న ప్రజలే ఎక్కువగా ఉన్నందున పంచాయతీరాజ్ చట్టాన్ని ఆయా భాషల్లో ముద్రించి ఇవ్వడానికి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos