ఢిల్లీ పోలీసుల ఆందోళన

ఢిల్లీ పోలీసుల ఆందోళన

న్యూ ఢిల్లీ: ఢిల్లీ పోలీసులు మంగళవారం న్యాయం కోసం ఇక్కడి తమ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.పరిసరాల్లో వాహన సంచా రానికి అవరోధం కలిగింది. విధులకు హాజరు కావాలని ఉన్నతాధికార్లుచేసిన వినతిని తోసి పుచ్చారు. పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా వచ్చి మాట్లాడాలని పట్టు బట్టారు. ఈ నెల 2న తీస్ హజారీ న్యాయస్థానాల సముదాయం సంభవించిన ఘర్షణల వల్ల కింది న్యాయ స్థానాల న్యాయవాదులు ఢిల్లీ లో సోమవారం నిరసన చేసారు. అప్పుడు కొందరు న్యాయవాదులు ఢిల్లీ పోలీసులపై దాడి చేసిన వీడియోలు సామా జిక మాధ్యమాల్లో రావటం సంచలనమైంది. శనివారం ఘర్షణలో పోలీసులతో సహా సుమారు 30 మంది గాయపడ్డారు. 20 వాహనాలు ధ్వంస మయ్యాయి. వాహనాల నిలుపుదల విషయంలో తలెత్తిన చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. స్వయం ప్రేరితంగా ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం దీనిపై ఆది వారం విచారణ చేపట్టి న్యాయ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్ను సస్పెండ్ చేయటమే కాకుండా పలువురు పోలీసు అధికారులకు చర్యలకు ఆదేశించింది. తీస్ హజారీ, కార్కర్డూమ జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos