తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చట్టం ఉచ్చు..

తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చట్టం ఉచ్చు..

హైదరాబాద్‌ నగర శివార్లలో దిశను అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటనలో నిందితుల చుట్టూ పోలీసులు చట్టం ఉట్టు బిగిస్తున్నారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. తొండుపల్లి వద్ద లారీని నిలిపి ఉంచినట్టు ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుల కదలికపై సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. ఘటన జరిగిన రోజున నిందితులు అక్కడే ఉన్నట్టు లారీ యజమాని ఇచ్చే వాంగ్మూలం కేసులో  అత్యంత కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు, ప్రాథమిక దర్యాప్తులోనే నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరనున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.ఇదిలా ఉండగా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు అక్కడ కూడా పటిష్టమైన భద్రత ఉండే మహానది బ్యారక్‌లో నిందితులను ఉంచారు. నాడు తాను ప్రమాదంలో ఉన్న సమయంలో తన చెల్లెలికి ఫోన్ చేసిన దిశకు పోలీసులకు ఫోన్ చేయాలన్న ఆలోచన రాకపొవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, దిశ చెల్లెలు స్పందించింది. ఎంతో మంది తానుగానీ, తన సోదరిగానీ డయల్-100కు ఫోన్ చేయాల్సిందని అంటున్నారన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అక్క అంత సీరియస్ పరిస్థితిలో ఉంటుందని తాను ఊహించలేదని చెప్పింది. లోకంలో ఇటువంటి నీచులు కూడా ఉంటారని అనుకోలేదని, ప్రమాదాన్ని ముందుగా తెలుసుకోలేకపోయానని అన్నారు. లేకుంటే తాను కచ్చితంగా 100కు ఫోన్ చేసివుండేదాన్నని చెప్పారు. తన సోదరి సైతం రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిందని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos