కశ్మీర్‌లో అణచివేత

కశ్మీర్‌లో అణచివేత

న్యూఢిల్లీ : కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత అక్కడి పరిస్థితులపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. యూరోపియన్ యూనియన్ పార్ల మెంటు సభ్యుల బృందం ‘అనధికారి’క పర్యటన ఇందులో భాగమే. మంగళవారం అది మొక్కుబొడిగా సాగింది. పార్లమెంటు సభ్యుల బృందం శ్రీనగర్ సైనిక కార్యాలయానికి వెళ్లి ఉగ్రవాద వివరాలను అధికారులు నుంచి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసు కుంటామని వెళ్లిన ఆ బృందం ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించ లేదు. దాల్ సరస్సులో పడవలో షికారు చేసి ఆనందించారు.అనధికార పర్యటన అయినా వారికి అధికారులే అన్ని ఏర్పాట్లూ చేయడం ప్రత్యేకత. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం తన అనుకూల మాధ్యమాల ద్వారా ప్రచారం చేయిస్తోంది. ప్రజలతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో నలుగురు సభ్యులు పర్యటనను విరమించుకొని వారి స్వదేశాలకు వెళ్లిపోయారు. ‘ఎటువంటి భద్రత లేకుండా స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిని అధికారులు తిరస్కరించారు. ప్రజలతో మాట్లాడే అవకాశం లేనప్పుడు అక్కడ పర్యటించి ఏం తెలుసుకుంటాం. మోదీ ప్రభుత్వ ప్రచార ఎత్తుగడలో భాగం కాదలచుకోలేదు. అక్కడి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా చెప్పేందుకు సిద్ధంగా లేను. ప్రజాస్వామ్య విలువలు అణచివేయ బడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని ప్రపంచం పరిగణనలోకి తీసుకోవాల్సిన ఉంది. భారత్లోని విపక్షాల నేతలు, జర్నలిస్టులకు అక్కడ పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదో ప్రభుత్వం చెప్పాల’ని లిబరల్ డెమోక్రాట్ ఎంపీ క్రిస్ డేవీస్ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos