గంట సేపు సైక్లింగ్‌తో స్థూలకాయం అదుపు

గంట సేపు సైక్లింగ్‌తో స్థూలకాయం అదుపు

బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా…దీని కోసం చేయని ప్రయత్నమంటూ లేదా…వీటికంతటికీ సైక్లింగ్‌ మించినది లేదని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్‌ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. రోజూ ఓ గంట సేపు సైకిల్‌ తొక్కండి. ఆఫీసుకూ సైకిల్‌ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదు. సరైన శరీరాకృతికి సైక్లింగ్‌ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు కరుగుతుందో, రోజూ గంట సేపు సైకిల్‌ తొక్కినా అదే స్థాయిలో కొవ్వు కరుగుతుందని చెప్పారు. స్థూలకాయంతో బాధపడుతున్న 130 మందిపై పరిశోధనలు జరిపాక, ఈ విషయం వెల్లడైందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos