సంక్షోభంలో ఆటోమొబైల్ రంగం

  • In Money
  • August 16, 2019
  • 122 Views
సంక్షోభంలో ఆటోమొబైల్ రంగం

హైదరాబాద్‌ : దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతోందనే వార్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వాహనాల అమ్మకాలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఆటోమొబైల్‌ రంగంలో పది లక్షల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే సంకేతాల నడుమ ఈ రంగం దాదాపుగా సంక్షోభం దిశగా సాగుతోంది. వాహనాల కొనుగోలు, బీమా వ్యయం పెరగడం, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్య సమస్య, ధరల పెంపు లాంటి కారణాల వల్ల అమ్మకాలు తగ్గాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త వాహనాల అమ్మకాలు 19 శాతం తగ్గినట్లు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. కార్లు, స్కూటర్ల విక్రయాల్లో బాగా క్షీణత కనిపిస్తోంది. ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు ఏప్రిల్‌ నుంచే బాగా క్షీణించినట్లు ఆటోమొబైల్‌ రంగ నిపుణులు తెలిపారు. ఏప్రిల్‌ నుంచి నాలుగు నెలల కాలానికి గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు మైనస్‌ నాలుగు శాతంగా నమోదయ్యాయి. తరచూ పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం, ఫైనాన్స్‌ కంపెనీల అధిక వడ్డీ రేట్లు, వాహనాల ధరలు పెరగడం కూడా అమ్మకాల క్షీణతకు కారణాలుగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos