కోవ్యాక్సిన్ శాస్త్రీయ పత్రం లో అవకతవకలు

న్యూఢిల్లీ : స్వదేశీ టీకా కోవ్యాక్సిన్ మూడవ దశ ఫలితాల శాస్త్రీయ పత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. చాలా అంతరాలు కనిపిస్తున్నాయి. వివిధ పరీక్షా ఫలితాల గణాంకాల వ్యత్యాసంతో పాటు పరీక్షల సమగ్రతను దెబ్బతీసేలా ఉంది. డిసెంబర్ 2020లో కోవాగ్జిన్ 3వ దశ ట్రయల్స్ జరిపేందుకు భోపాల్లోని పీపుల్స్ ఆసుపత్రి నగరంలోని కొందరు పేదల్ని ఎంపిక చేసింది. కోవాగ్జిన్ టీకా ఉచితంగా ఇస్తున్నామని, ఇవి తీసుకుంటే రూ. 750 ఇస్తామని నమ్మించడంతో వారు ట్రయల్స్కు సిద్ధమయ్యారు. ఈ వివరాలేమీ పరిశోధనా పత్రాల్లో వెల్లడించ లేదు. పరీక్షలు చేయించుకునే వారి పట్ల సదరు ఆసుపత్రి సరైన ప్రోటోకాల్స్ అనుసరించలేదు.ఈ విషయాలన్నింటినీ కూడా సైన్స్ జర్నలిస్ట్ ప్రియాంక పుల్లా బహిర్గతం చేశారు. పరీక్షల్లో పాల్గన్న వారికి ఉచిత వైద్య రక్షణా కల్పించలేదు. టీకా వేసుకున్న వారిలో ఒకరికి జ్వరం రాగా, ఆసుపత్రికి వెళితే రోగ నిర్ధారణకు రూ. 450లు వసూలు చేసింది. నాల్గవ అంశం.. తొలి మోతాదు ఇచ్చిన తర్వాత తేలికపాటి దుష్ఫ్రభావాలు ఎదుర్కొన్న కార్పెంటర్ జై రామ్ను కూడా ఆసుపత్రి సంప్రదించలేదు. టీకా తీసుకన్నాక ఓ వ్యక్తి మరణించాడు. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. మరో  అంశం.. టీకా తీసుకునేందుకు వచ్చిన వారిలో చాలా మంది 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనబాధితుల కుటుంబాల వారు. ఈ విషయంలోనే ఇప్పటికీ సరైన పరిహారం అందలేదన్నదీ మరో కోణం. చాలా మంది బాధితులు రెండవ మోతాదు తీసుకోవడానికి ముందు ఆసుపత్రి నిర్వాకం గురించి తెలుసుకుని మరోసారి పరీక్షకు హాజరుకా లేదు. మొత్తం ఈ దశలో 1379 మంది పరీక్షల నుండి వైదొలిగినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos