లక్షలాది ఉద్యోగాలకు కరోనా ఎసరు

  • In Money
  • March 24, 2020
  • 109 Views
లక్షలాది ఉద్యోగాలకు కరోనా ఎసరు

న్యూయార్క్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 మహమ్మారి సునామీలా విరుచుకుపడిందని మూడీస్ అనలటిక్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ఆసియాలో ప్రధాన దేశాలు, యూరోపియన్ దేశాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతోందని తెలిపింది. మూడీస్ అనలటిక్స్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జండీ రాసిన విశ్లేషణలో కంపెనీల మూసివేతలు, వ్యాపారాలు పెట్టుబడులను కుదించడం, రిటైర్‌మెంట్ కోసం దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడం వంటివాటి వల్ల మరింత ఎక్కువ ఆర్థిక బాధలు వేగంగా కమ్ముకొస్తున్నాయని చెప్పారు. రాబోయే వారాల్లో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నట్లు తెలిపారు. నెలసరి ఆదాయంపై జీవించే కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా వ్యాపారాలు లే ఆఫ్ ప్రకటించడంతో నిరుద్యోగ బీమా క్లెయిములు మార్చి 8తో ముగిసిన వారం 2.80 లక్షలకు పెరిగాయి. అంతకుముందు వారం ఈ క్లెయిముల సంఖ్య 2.10 లక్షలు. ఉద్యోగావకాశాలు వృద్ధి చెందడం లేదని, వారానికి దాదాపు 2.40 లక్షల నిరుద్యోగ బీమా క్లెయిములు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos