కరోనా బాధ్యతల్ని గడ్కరికి అప్పగించాలి

కరోనా బాధ్యతల్ని గడ్కరికి అప్పగించాలి

న్యూ ఢిల్లీ: ‘కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరం. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలి. పీఎంఓపై ఆధారపడటం దండగ’ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి బుధవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని, ప్రధాని మోదీని కాదని వివరించారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేద న్నారు. ఆయన తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు. మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని హెచ్చరించారు. ఇది పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos