సంప్రదాయాల్ని పాటించని సర్కారు

సంప్రదాయాల్ని పాటించని సర్కారు

అమరావతి:శాసన సభలో పాలక పక్షం సభా సంప్రదాయాల్ని పాటించటం లేదనే విషయం ప్రజల దృష్టికి వెళతామని  విపక్ష నేత చంద్ర బాబు నాయుడు అన్నారు. గురువారం దిగువ సభలో ఆయన ప్రసంగించారు. ‘సభాపతిగా తమ్మినేని సీతారాంని ఎంపిక చేసినట్లు చెప్పి నపుడు ఒక మంచి నిర్ణయం తీసు కున్నారని భావించాం.అలాగే మమ్మల్ని అడిగినపుడు పూర్తిగా సహకరించాలనే తీర్మానించారు. అయితే అలా జరగ లేదు.ఇంతకు ముందు నేను ముఖ్యమంత్రిగా, సభా నాయకుడుగా ఉన్నప్పుడు సభాపతిని ఎంపిక చేసిన తర్వాత విపక్ష నేత జగన్‌కు నామ పత్రాల్ని పంపించాం.ఆయన సంతకం తీసుకున్న తర్వాతే నామపత్రాన్ని దాఖలు చేసాం. ఇప్పుడు సభాపతి ఎంపిక గురించి మాకు కబురు అందుతుందే మోనని చూశాం. ఎవరూ చెప్పలేదు. గురువారం సభలోనూ కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి సభా గౌరవాన్ని పాటించటం లేదు. ఇష్టమైతే రండి, లేకపోతే లేదు అన్న విధంగా ప్రవర్తించారు’అని తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారోన్న విషయం కూడా ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. తామెన్నడే ఏక పక్షంగా వ్యవహరించలేదన్నారు. సంప్రదాయాల్ని వైకాపా పాటించటం లేదని తప్పుబట్టారు. సభకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos