చేసిన తప్పుల్ని భాజపా ఎన్నటికీ అంగీకరించదు

చేసిన తప్పుల్ని భాజపా ఎన్నటికీ అంగీకరించదు

కోల్కతా: పౌరసత్వానికి మతంతో ముడి పెట్టటం పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ చట్టం అమలు కాకుండా ఉండాలంటే అత్యు న్నత న్యాయస్థానం దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి. లేక ప్రభుత్వమే స్వయంగా దీన్ని రద్దు చేయాలి. ఇది ఎలాగూ సాధ్యపడదు. ఎందుకంటే భాజపా ఎప్పటికీ తన తప్పులను అంగీకరించదు’ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యా నిం చారు. గురువారం ఒక వార్త సంస్థతో జరిపిన ముఖా ముఖిలో ఆ మేరకు పేర్కొన్నారు. ‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరే కంగా తీర్మానాలు తీసుకురావడం రాజకీయ కోణం. పౌరసత్వ వితరణలో రాష్ట్రాల పాత్ర ఉండదు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), ఎన్సార్సీ తయారీలో రాష్ట్రాలు క్రీయాశీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే వీటి అమలుకు కేంద్రం వద్ద తగినంత సిబ్బంది లేక పోవటమే. పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చేది. వీటి అమలు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. సీఏ ఏ ను అమలు చేయ బోమని చట్ట పరంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేవు.ఎన్పీఆర్, ఎన్నార్సీ ప్రక్రియ చేపట్టబోమని మాత్రం చెప్పొచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos