కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, ఝూర్ఖండ్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠీ శుక్రవారం నామ పత్రాల్ని సమర్పించారు. అక్టోబరు 19న ఫలితాలు వెలువడనున్నాయి. మాజీ కేంద్రమంత్రి ఏకే ఆంటోనీ, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ పేర్లు కూడా అధ్యక్ష పదవికి పోటీలో వినిపించాయి. శశిథరూర్ కాంగ్రెస్లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. సమయోచితంగా ఆలోచిస్తూ మాట్లాడే వ్యక్తి. పట్టణవాసులు, చదువుకున్న వారిలో శశిథరూర్కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న అతి కొందరు కాంగ్రెస్ నాయకుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం ఆయన మైనస్ పాయింట్. అనేక మంది కాంగ్రెస్ నేతల మాదిరిగా ఉత్తరాది రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం శశిథరూర్కు కష్టమే కావొచ్చు. ఇవన్నీ పక్కనబెడితే.. కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసిన జీ23 బృందంలో శశిథరూర్ సైతం ఉన్నారు. ఇది ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే మొదటి నుంచి పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడు. వివాదరహితుడు కూడా. అలాగే సోనియా అప్పగించిన కార్యక్రమాలను చక్కగా నిర్వర్తిస్తారనే పేరు కూడా ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం కొంత ప్లస్ పాయింట్. పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గహ్లోత్, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ వంటి నేతల మద్దతు ఉంది. అలాగే గాంధీ కుటుంబం నుంచి కూడా పరోక్షంగా ఖర్గేకు మద్దతు ఉంది. దాదాపు పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖర్గేకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు ఝూర్ఖండ్కు చెందిన కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠీ. ఆయన మాజీ మంత్రి. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos