గ్రామాల్లో చికిత్స కేంద్రాలు

గ్రామాల్లో చికిత్స కేంద్రాలు

అమరావతి: ‘ప్రాణం విలువ నాకు తెలుసు…’అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ప్రసంగించారు. ‘ప్రాణం విలువ నాకు తెలుసు అధ్యక్షా. దివంగత మహానేత వైఎస్సార్ చనిపోయిన సమయంలో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి వారి కోసం ఏ రాజకీయ నేత చేయని విధంగా ఓదార్పు యాత్ర చేశాను. వారికి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. ప్రాణం విలువ తెలుసు కాబట్టే, ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి రావాలని, ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండ కుండా, ప్రాణంపోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించాం. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నాం. మేం అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1000 చికిత్సలకే అనుమతి ఉంది. మేం వచ్చాక 2,400 జబ్బులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 1180 అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేసి ప్రతి మండలానికి చేరవేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వైఎస్సార్ గ్రామ చికిత్స కేంద్రాలు90 రకాల రుగ్మతలకు అక్కడ ఔషధాలు లభిస్తాయ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos