కనీస సహాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి

కనీస సహాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి

న్యూఢిల్లీ : లాక్డౌన్ లో సామాన్యుల్ని ఆదుకోవటానికి కనీస సహాయ కార్యక్రమాన్ని(కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాం) ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం డిమాండ్ చేశారు.‘లాక్డౌన్ వల్ల ప్రజలు వేతన కోతలను ఎదుర్కొంటున్నారు. యువతకు ఉపాధీ లేదు. అన్ని వర్గాల ఆదాయ వనరులూ తగ్గి పోయాయి. వీటితో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రజలు తీవ్ర బాధలో మునిగి పోయార’ని ఆవేదన చెందారు. గురువారం ఆమె కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి- సీడబ్ల్యూసీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.‘ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ సబబే. 21 రోజుల లాక్డౌన్ను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా విధించారు. దీంతో వలస కూలీల బతుకులు మరింత దుర్భరంగా, భయంకరంగా మారాయి. వాహనాలు, తిండీ తిప్పలు లేకుండా వలస కూలీలు వందల కి.మీ నడవడం చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. ఆసుపత్రులు, క్వారంటైన్, వైద్య పరీక్షల కేంద్రాలు,మందులు వివరాలను కేంద్రం అన్ని చోట్లా ముద్రించాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos