అప్పుడు మాయాబజార్‌ ఇప్పుడు రంగస్థలం..

  • In Film
  • June 27, 2019
  • 201 Views
అప్పుడు మాయాబజార్‌ ఇప్పుడు రంగస్థలం..

అప్పటివరకు నటించిన సినిమాలకు భిన్నంగా పూర్తిస్థాయి పల్లెటూరి యువకుడిగా పైగా బధిరుడిగా రామ్‌చరణ్‌ నటించిన రంగస్థలం ఎన్ని సంచలనాలు సృష్టించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త తరహా కథలకు,చిత్రాలకు చిరునామాగా నిలిచే దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం గత ఏడాది విడుదలై వసూళ్ల వరద పారించింది.చాలా ప్రాంతాల్లో బాహుబలి అనంతరం భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం చరిత్ర సృష్టించింది.రామ్‌చరణ్‌తో పాటు సమంత,ఆది పినిశెట్టి,జగపతిబాబు ఇలా ప్రతీ ఒక్క పాత్ర తెరపై సహజంగా కనిపించడంతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది.తెలుగులో అంతటి ఘనవిజయాన్ని సాధించిన రంగస్థలం చిత్రం త్వరలో కన్నడలో అనువాద రూపంలో విడుదల కానుండడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది.వచ్చే నెలలో కన్నడ భాషలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా రంగస్థళ పేరుతో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం టీజర్‌ విడుదల చేశారు.తెలుగులో చిట్టిబాబు పాత్ర కన్నడలో కిట్టిబాబుగా మారిపోయింది.సామాజిక మాధ్యమాల్లో టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది.దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను కన్నడ చిత్ర పరిశ్రమ ఇటీవలే ఎత్తివేయడంతో దక్షిణాదిలోని అన్ని చిత్ర పరిశ్రమల సినిమాలు ఇకపై కన్నడలో కూడా అనువాద చిత్రాలుగా విడుదల కానున్నాయి.ఈ క్రమంలో రామ్‌చరణ్‌కు మరుపురాని చిత్రంగా నిలిచే రంగస్థలం కూడా విడుదల కానుంది.అలనాటి ఆణిముత్యం మాయాబజార్‌ చిత్రం అనంతరం కన్నడలో విడుదల కానున్న చిత్రంగా కూడా రంగస్థలం చరిత్ర సృష్టించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos