‘మా’ డైరీ ఆవిష్కరణలో కలకలం..

  • In Film
  • January 2, 2020
  • 131 Views
‘మా’ డైరీ ఆవిష్కరణలో కలకలం..

మెగాస్టార్‌ చిరంజీవి హీరో రాజశేఖర్‌ మధ్య మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి.చాలా ఏళ్లుగా చిరంజీవి,రాజశేఖర్‌ మధ్య మనస్పర్ధలు నెలకొన్న విషయం తెలిసిందే.దశాబ్ద కాలం క్రితం రాజశేఖర్‌ కారుపై జరిగిన రాళ్ల దాడి వెనుక చిరంజీవి అభిమానుల హస్తం ఉందని ఆరోపణలు రావడంతో ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి.ఈ క్రమంలో తాజాగా ఇద్దరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో  పాల్గొన్న చిరంజీవి, సినిమా అసోసియేషన్ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, పెద్దగా అరిచి చెప్పాలని, గొడవలు వస్తే, చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.‘మా’లో మూలధన నిధి పెరిగే కొద్దీ గొడవలు పెరుగుతున్నాయని ఎవరి పేరునూ చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తామంతా కుటుంబం వంటి వాళ్లమేనని అన్నారు. త్వరలోనే విదేశాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందరు హీరోలనూ పిలిపించి, ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి నిధిని పెంచుదామని సూచించారు. విభేదాలు వస్తే, బయట పడకుండా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.ఆపై మైక్ ను అందుకున్న హీరో రాజశేఖర్, నిప్పును ఎంతగా దాచాలని ప్రయత్నించినా, పొగ రాకుండా మానదని వ్యాఖ్యానించడంతో వేదికపై రభస మొదలైంది. రాజశేఖర్ ను వారించే ప్రయత్నాన్ని చిరంజీవి చేశారు. సమయంలో రాజశేఖర్, చిరంజీవిని ఉద్దేశించి, మీరు మాట్లాడేటప్పుడు తాను కల్పించుకోలేదని, ఇప్పుడు మీరూ కల్పించుకోవద్దని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించారు. “వినండి. మీరు అరిచేస్తే ఏదీ జరిగిపోదు. నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు ఉన్నారు. శ్రీకాంత్, శివాజీ రాజా ఉన్న సమయంలో ప్రాబ్రమూ జరగలేదని చిరంజీవి అన్నారు. దాన్నే ప్రాబ్లమ్ గా తీసుకుని నరేశ్ ఇప్పుడు వచ్చి, వాళ్లు తప్పు చేశారని అంటున్నారుఅని వ్యాఖ్యానించారు. సమయంలో జయసుధ స్టేజ్ పైకి వచ్చి, రాజశేఖర్ చేతిలోని మైక్ ను తీసుకునేందుకు ప్రయత్నించారు. మోహన్ బాబు స్టేజ్ దిగి వెళ్లిపోయేందుకు లేచారు. తన ప్రసంగాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్న రాజశేఖర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఏదీ నిజాయితీగా జరగడం లేదని, తాను సత్యంగా బతకాలని అనుకుంటున్నానని, నిజాన్ని చెబుతున్నానని వ్యాఖ్యానించడంతో మరింత కలకలం రేగింది. ఏదైనా ఇంతకుముందే అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వుండాల్సిందని, తానేమీ చిన్న పిల్లాడిని కాదని, విషయాన్ని అయినా కప్పి పుచ్చాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజశేఖర్ విమర్శల తరువాత, మరోసారి మైక్ తీసుకున్న ఆయన, “నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్ లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికినిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం ఎలా ఉంటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరేఅని చిరంజీవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఎంతో సజావుగా, హృద్యంగా సాగుతున్న సభలో, ఎగ్రసివ్ గా మైక్ లాక్కుని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా, లాక్కుని చేయడం మర్యాద కాదని హితవు పలికారు. ఇప్పుడు కూడా తాను కోపంతో మాట్లాడే వాడిని కాదని, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా, తనకు కోపం వచ్చేలా చేశారని చిరంజీవి వ్యాఖ్యానించారు. దయచేసి, ఇక ఆపేసి, మంచిని గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఎవరూ కోపావేశాలకు వెళ్లవద్దని, ఫ్యూచర్ ఎయిమ్ గురించి మాట్లాడుకుందామని అన్నారు. మీడియా దీని గురించి చిలువలు, పలువలుగా రాస్తుందని, అవసరమైన విషయాలను పక్కన పెడతారని అన్నారు. సమయంలో మరోసారి కల్పించుకున్న రాజశేఖర్, తాను నిజాన్ని మాత్రమే మాట్లాడానని, తాను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోనని చెబుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి చేశారని, కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డ చిరంజీవి, అటువంటి వారికి సమాధానం చెప్పబోనని, మాలోని క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos