చివరకు చింతమనేని అరెస్టు

చివరకు చింతమనేని అరెస్టు

అమరావతి:పలు కేసుల్లో నిందితుడైన తెదేపా నేత చింతమనేని శ్రీనివాసరావును పోలీసులు బుధవారం దుగ్గిరాలలో అరెస్టు చేసారు. అనారోగ్యం పాలైన భార్యను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు బంధించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. పోలీసులు, ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ‘ నాపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మనిషికీ ఒక నీతి అనేది ఉంటుంది. ఏ ధర్మం ప్రకారం పోలీసులు నాపై ఇన్ని అక్రమ కేసులను పెట్టారు. ఎందుకు తనను అరెస్ట్ చేసారు. మా మనుషులు, కార్యకర్తల్ని ఎందుకు ఇబ్బందుల పాల్జేస్తున్నారు. మా ఇంట్లోని విలువైన వస్తువుల్నీ పోలీసులు పగలగొట్టారు. . తన కుటుంబ సభ్యులనూ ఇబ్బంది పెట్టార’ని మండిపడ్డారు. ‘ఇన్ని రోజులు నేను బయటకు రాలేదు. నా పనేదో తాను చేసుకుంటున్నా. తనను రెచ్చగొట్టారు. ఏ విచారణకైనా తాను సిద్ధమ’న్నారు. ‘నేను తప్పు చేసినట్లు మంత్రి బొత్సా రుజువు చేస్తే నా తండ్రి ఆస్తి, నా ఆస్తిని పేదలకు దానం చేస్తాను.లేకపోతే మంత్రి పదవికి బొత్సా రాజీనామా చేస్తారా’ని సవాల్ విసిరారు. ‘నాకు మెజిస్టీరియల్ విచారణ అవసరం లేదు. గ్రామ పంచా యతీలో నేను తప్పు చేసినట్లు ఎవరైనా తీర్మానిస్తే ఏ శిక్షకైనా సిద్ధమ’న్నారు. ‘వైకాపా నేత విజయసాయిరెడ్డి మమ్మల్ని దొంగలంటున్నారు. ఆయన దొరా? ఆయన మీద ఉన్నన్ని కేసులు ఎవరి మీదా లేవ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos