చైనాలో కరోనా తగ్గు ముఖం

చైనాలో కరోనా తగ్గు ముఖం

న్యూ ఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టింది. బుధవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చైనా ఆరోగ్య కమిషన్(ఎన్హెచ్సీ) అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘చైనాలో అంతర్గతంగా బుధవారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 34 కేసులు కొత్తవి నమోదయ్యాయి. వారంతా విదేశాల నుంచి చైనాకు వచ్చిన వారు’అని వివరించారు. వైరస్ సోకిన వారిలో బుధవారం మరో 8మంది మృతి చెందారు. చైనాలో ఇప్పటి వరకు మొత్తం నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 80,928కి చేరింది. మొత్తం 3,245 మంది మృతి చెందారు. చైనా తర్వాత కోరోనా అత్యధికంగా ప్రభావం చూపుతున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇప్పటి వరకూ 1,135 మంది మృతి చెందారు. మొత్తం 17,361 కేసులు నమోదయ్యాయి. కరోనాకు 157 దేశాల్లో 8,809 మంది బలయ్యారు. 2,18,631 మందికి వైరస్ సోకిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos