చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్న తైవాన్

చైనాతో యుద్ధానికి సిద్ధమవుతున్న తైవాన్

తైపీ సిటీ : తైవాన్ – చైనా ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. తైవాన్లో దాదాపు 25 ఏళ్ల తర్వాత యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి తైవాన్లో అడుగుపెట్టబోతున్నారు. ఆమె పర్యటనను చైనా వ్యతిరేకిస్తోంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించింది.దీంతో తైవాన్ అప్రమత్తమైంది. చైనాతో యుద్ధానికి సిద్ధమవుతోంది. కొందరు అధికారులు, సైనికులకు సెలవులు రద్దు చేసింది. యుద్ధానికి సిద్ధమవ్వాలని గనతల రక్షణ దళాలనే ఆదేశించింది. తన సొంత భూభాగమైన తైవాన్లో అమెరికా ప్రతినిధి పర్యటన చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా పదే పదే హెచ్చరించింది. ‘‘ నిప్పుతో చెలగాటమాడేవారు దానితోనే నాశనమవుతారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీ చూస్తూ కూర్చోదు.. ఎలాంటి పరిణామాలు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలని అమెరికాను మళ్లోసారి హెచ్చరిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా బలంగా విశ్వసిస్తోంది. పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు గెలుపొందాక 1949లో తైవాన్, చైనా వేరుపడ్డాయి. ఒకే దేశంగా కొనసాగుతామని అప్పట్లో రెండు దేశాలూ చెప్పాయి. జాతీయ నాయకత్వం సూచించే ప్రభుత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదర లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos