చెల్లని చెక్కులిచ్చినందుకు ఏడాది జైలు శిక్ష

చెల్లని చెక్కులిచ్చినందుకు ఏడాది జైలు శిక్ష

చెన్నై : చెక్బౌన్స్ నేరానికి తమిళ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య నటి రాధికకు చెన్నై ప్రత్యేక న్యాయ స్థానం బుధవారం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. తమపై ఉన్న రెండు చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయవిచారణ రద్దు చేయాలని కోరుతూ 2019లో వీరు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. నందనంలో సినిమా నిర్మాణాలకు రుణం అందించే రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తేయ్నంపేట్కు చెందిన మేజిక్ ఫ్రేమ్స్ అనే సంస్థ భారీ మొత్తాన్ని రుణంగా తీసుకుంది. మేజిక్ ఫ్రేమ్స్ సంస్థలో నటుడు శరత్ కుమార్ ఆయన భార్య నటి రాధిక, లిస్టిన్ స్టీఫెన్ భాగస్వాములు. అప్పు తీర్చేందుకు తేదీ రాయని చెక్లను శరత్కుమార్ చెల్లించారు. 2017 మార్చిలో ఆ చెక్కులు చెల్లుబాటు కాలేదు. దాంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రేడియన్స్ మీడియా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos