నెలవంక చెంతకు….

నెలవంక చెంతకు….

శ్రీహరికోట : జాబిల్లిపై పరిశోధనన కోసం ఉద్దేశించిన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో సోమవారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. 20 గంటల కౌంట్ డౌన్ తర్వాత 3.8 టన్నుల బరువైన చంద్రయాన్ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జీఎస్ఎల్వీ-మార్క్3ఎం1 వాహక నౌక (రాకెట్) 16 నిమిషాల 13 సెకండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమికి దగ్గరగా 170 కి.మీలు, భూమికి దూరం 39059 కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్ 2ను విడిచిపెట్టింది. అయిదు రోజుల తర్వాత భూ నియంత్రిత కక్ష్యలోకి చంద్రయాన్ 2 ప్రవేశిస్తుంది. సగటున రోజుకు 3.84 లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న జాబిల్లిపై దిగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos