సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం

సెంట్రల్ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్నందున భవన నిర్మాణ కార్యకలాపాల్ని నిషేధించినా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నందుకు సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఇది దృష్టికి వచ్చింది. ఢిల్లీలో భవన నిర్మాణ కార్యక లాపాలపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తోందని సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తప్పుబట్టారు. ‘కాలుష్య నియంత్రణకు అనేక అవస్థలు పడుతున్నాం. సెంట్రల్ విస్టా అయినా, పరిశ్రమ అయినా, మరొకటి అయినా, ప్రభుత్వాన్ని వివరణ కోరుతామ’ని న్యాయమూర్తి రమణ చెప్పారు. కొన్ని అంశా లను ప్రస్తావించి, వాటి మీదే దృష్టి కేంద్రీకరించవద్దని, అలా అయితే అసలు సమస్య పక్కదారి పడుతుందని చెప్పారు. దీనిపై ప్రమాణ పత్రాన్ని సమర్పించామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ‘మీరు ఓ కాగితాల కట్టను ఇస్తే మేం చదువుతామని ఎలా అనుకున్నారు? పిటిషనర్లు కూడా కొన్ని కాగితాలను దాఖలు చేశారు, వాటిని మేం చదవబోమని వారు అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేస్తోంద’ని న్యాయమూర్తిరమణ వ్యాఖ్యానించారు. కాలుష్య నియంత్రణపై ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిం చేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటిస్తున్నట్లు కేంద్రం చెప్తున్నప్పటికీ, ఫలితం శూ న్యంగా కనిపిస్తోందని చెప్పారు. గాలి నాణ్యత నిర్వహణ కమి షన్ జారీ చేసిన ఆదేశాలన్నిటినీ తక్షణమే పాటించాలని ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభు త్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos