ఓలా, ఫ్లిప్‌ కార్ట్‌ క్రెడిట్‌ కార్డులు త్వరలో

ఓలా, ఫ్లిప్‌ కార్ట్‌ క్రెడిట్‌ కార్డులు త్వరలో

న్యూఢిల్లీ: ఓలా, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు పెద్ద బ్యాంకుల సౌజన్యంతో తమ వినియోగదారులకు క్రెడిట్‌ కార్డుల జారీకి ప్రయత్నిస్తున్నాయి. తమ వినియోగదారుల ఖర్చులపై అంచనా లభిస్తుంది. ఇంకా క్రెడిట్‌ కార్డ్ విపణిలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడనుందని సంబంధిత అధికార్లు తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఓలా క్రెడిట్‌ కార్డును ప్రయోగాత్మకంగా వచ్చే వారం ప్రారంభించనుంది. తొలి ఏడాది పది లక్షల కార్డులను జారీ చేయదలచినట్లు చెప్పారు. యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో ఫ్లిప్కార్టు వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను అందించదలచింది. ప్రస్తుతం ‘బై నౌ.. పే లేటర్‌’ అనే వ్యాపార విధానాన్ని కొనసాగిస్తోంది. నిరుడు అక్టోబర్‌లోనే అమెజాన్‌ పే, ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలసి సంయుక్త బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశ పెట్టంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos