చిదంబరం విచారణ మొదలు

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో నిందితుడు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయంలో కొందరు అధికారులు గురువారం ప్రశ్నించారు. వైద్య పరీక్షలు చేయించిన తర్వాత గురు వారం మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో హాజరు పరచనున్నారు. విచారణ కోసం ఆయన్ను తమ స్వాధీనం చేయాల్సిందిగా సిబిఐ కోరనుంది. గురువారం ఉదయం జరిపిన రెండో విడత విచారణలో ఇంద్రాణీ ముఖర్జీ పాత్ర పై ప్రశ్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన రిమాండ్కు సీబీఐ విజ్ఞప్తి చేయనుంది. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట చిదంబరం ఆరంభించిన భవంలోనే ఆయన విచారణ సాగుతుండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos